వరుస లాభాల్లో దేశీయ మార్కెట్లు

SMTV Desk 2017-11-24 16:56:30  International markets in profits, mumbai

ముంబయి, నవంబర్ 24 : అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు ఐటీ, ఫార్మా రంగాల షేర్ల అండతో సూచీలు లాభపడ్డాయి. ఈ ఉదయం 70 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్, ఒకానొక దశలో 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 91 పాయింట్లు ఎగబాకి, 33,679 వద్ద స్థిరపడింది. అటు నిప్టీ కూడా 41 పాయింట్లు లాభపడి 10,390 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.64.72గా కొనసాగుతోంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా దేశీయ మార్కెట్లకు లాభాలు వచ్చాయి.