హఫీజ్‌ సయీద్‌ విడుదలకు పాక్ ధర్మాసనం గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2017-11-22 18:00:25  lahore, hafiz muhammad saide, pak court, jud chief

లాహోర్, నవంబర్ 22 : పాక్ లో ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న లష్కేరే- ఈ- తోయిబా సహా వ్యవస్థాపకుడు, ముంబై మారణ హోమనికి ప్రధాన కారకుడు, ఉగ్ర సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను విడుదల చేయాల్సిందిగా పాకిస్థాన్‌ న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 31 నుంచి సయీద్‌ ఆయన నలుగురు అనుచరులు అబ్దుల్లా ఉబెద్‌, మాలిక్‌ జాఫర్‌ ఇక్బాల్‌, అబ్దుల్‌ రెహమాన్‌, క్వాజి ఖాసిఫ్‌ హుస్సేన్‌ను 90 రోజుల పాటు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో సయీద్‌ నలుగురు అనుచరులను అక్టోబర్ లో విముక్తి కలిగించారు. సయీద్‌ గృహనిర్బంధ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతడి నిర్బంధ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాల్సిందిగా పాక్‌ ప్రభుత్వం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన పాక్ ధర్మాసనం సరైన ఆధారాలు ఉంటేనే నిర్బంధం కొనసాగిస్తామని న్యాయస్థానం గతంలోనే పేర్కొంది.