రాష్ట్రాల్లో ఉపాధి అధ్యయనం

SMTV Desk 2017-11-22 11:13:59  AP assembly, Minister of Youth Services, kollu Ravindra, Unemployment

అమరావతి, నవంబర్ 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని శాసనసభలో యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రవీంద్ర ఈ విధంగా సమాధానం తెలిపారు. దీనిపై ఇప్పటికు మంత్రివర్గ ఉపసంఘం అనేక సార్లు చర్చించిందని, దీంతో వీలైనంత త్వరలో నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. అలాగే నిరుద్యోగ యువతకు భృతి కల్పించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో వినియోగించే అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారో అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.