మంత్రిపదవి ఈకతో సమానం: కొడాలి నాని

SMTV Desk 2017-11-21 16:18:27  kodali nani about minister post, kodali nani, ysrcp, ap updates

గుడివాడ, నవంబర్ 21: తాను మంత్రి పదవి ఆశించడం లేదని జగన్ హృదయంలో చోటే మంత్రి పదవితో సమానమని గుడివాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని, తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఈకతో సమానమని ఆయన, జగన్ హృదయంలో చోటు ఉంటే చాలన్నారు. గుడివాడలో తననే అందరికన్నా ఎక్కువ సార్లు గెలిపించారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే పులివెందుల మాదిరి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని నాని అన్నారు.