పేజీలను నమిలిన రచయిత

SMTV Desk 2017-06-12 15:51:45  Britan Parliament elections,Labour party Results,New Bregjit Book

లండన్ , జూన్ 12 : బ్రిటన్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ 38 శాతం కంటే ఎక్కువ ఓట్లు గెలిస్తే, అతను రాసిన న్యూ బ్రెగ్జిట్ పుస్తకాన్ని నములుతానని ప్రొఫెసర్ మ్యాథ్యూ గుడ్ విన్ (35) ట్విట్టర్ లో సవాలు చేశారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలలో లేబర్ పార్టీకి 40.3 శాతం ఓట్లు రావడంతో లేబర్ పార్టీ మద్దతుదారులు ఆయనను ప్రశ్నించారు. అంచనా వేసిన దాని కన్నా లేబర్ పార్టీకి 2 శాతం అదనంగా ఓట్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని ప్రొఫెసర్ తెలిపారు. చెప్పిన మాటను తప్పకుండా నిర్వహిస్తానన్నారు. ఆదివారం రోజున స్కై ఛానల్ గతంలో చెప్పినట్టుగానే న్యూ బ్రెగ్జిట్ పుస్తకంలోని కొన్ని పేజీలను తీసుకుని బలవంతంగా నమలడంతో అందరూ వింతగా చూడడం జరిగింది. ఇలాంటి సవాళ్ళను చేసే ముందు వెనుక చూసుకొని అవి ఎంతవరకు మంచి ఫలితాలను ఆశిస్తాయో అందరం గ్రహించాలని అంటున్నారు కొందరు.