వ్యవసాయ రంగం ప్రధానమై౦ది: వెంకయ్య నాయుడు

SMTV Desk 2017-11-15 12:27:12  Venkaiah naidu, chandrababu naidu , International Agricultural Conference,

విశాఖపట్టణం, నవంబర్ 15: విశాఖ జిల్లాలో అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభమైంది. ఏపీ అగ్రిగేట్ సమ్మిట్-2017 పేరిట మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... " దేశంలో వ్యవసాయ రంగం ప్రధానమై౦ది. 60 శాతం మందికి వ్యవసాయమే జీవనోపాధి. వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతికతను జోడించాలి. దేశ సాంప్రదాయాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి" అంటూ పేర్కొన్నారు.