పదవి కోస౦ పాదయాత్ర : టిడిపి నేత

SMTV Desk 2017-11-07 17:01:37  ycp jagan, TDP leader Kala Venkatrao,

అమరావతి, నవంబర్ 7 : ' జగన్ ది పదవి కోస౦ పాదయాత్ర కానీ ప్రజల కోసం కాదు ' అని టిడిపి నేత కళా వెంకట్రావు ఆరోపించారు. ఈ రోజు అయన మీడియాతో మాట్లాడుతూ... ఏ పార్టీకి అయిన నైతిక నిబద్ధత, పాలన పద్ధతి రెండు ఉండాలని ఆ రెండు వై సిపి నేత జగన్ కు లేవని విమర్శించారు. ప్రజా సమస్యలను చర్చించే వేదిక అసెంబ్లీ కు హాజరుకాలేదు, కానీ ప్రజా సమస్యలు తీరుస్తారా అని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తేనే పదవి వస్తుందంటే ఎవరైనా చేస్తారని ఆరోపించారు. ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ప్రస్తావించారు... ఇందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.