మొసలి పై చిరుత వేట

SMTV Desk 2017-11-04 13:29:10  LEOPARD ATTACK ON CROCODILE, IN AFRICA, LUSAKA, RARE INCIDENT

లుసాకా, నవంబర్ 04 : ఆఫ్రికా.. దట్టమైన ఆడవులతో రకరకాల వన్యప్రాణుల ఆవాసం. సృష్టిలో ప్రతి జీవికి ఆకలి పోరాటం తప్పదు. కానీ, తూర్పు ఆఫ్రికాలోని జాంబియా దేశ అరణ్యంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. దాహార్తిని తీర్చుకోవడం కోసం ఒక చిరుత మడుగు దగ్గరకు వెళ్ళగా మొసలి కన్పించింది. అంతే చిరుత ఒక్కసారి వేగంగా మొసలిని వేటాడి తన ఆహారంగా చేసుకుంది. ఇలా మొసళ్లను ఓ జంతువు వేటాడటం చాలా అరుదని పదేళ్లుగా జాంబియా అడవుల్లో సంచరిస్తూ జంతువుల కదలికలను నిశితంగా గమనిస్తున్న ఫొటోగ్రాఫర్‌ ఒకరు తెలిపారు.