డెమోక్రటిక్‌ ప్రతినిధులపై మండిపడ్డ ట్రంప్

SMTV Desk 2017-11-02 13:48:01  Terror in New York, American President Donald Trump, green card, Democratic representatives

వాషింగ్టన్, నవంబర్ 02 ‌: న్యూయార్క్‌లో ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి నేపథ్యంలో గ్రీన్ కార్డుల జారీకి ఉద్దేశించిన లాటరీ విధానాన్ని రద్దు చేసి తీరుతానని అమెరికా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో దాడికి పాల్పడింది ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లోగా గుర్తించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వైవిధ్య లాటరీ విధానానికి బదులుగా ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు లాటరీ పథకం రద్దు కోసం సత్వరమే కార్యాచరణ మొదలుపెట్టాలని అమెరికా కాంగ్రెస్‌ను కోరబోతున్నట్లు తెలిపారు. అయితే వలస విధానాన్ని కఠినతరం చేయడంలో డెమోక్రటిక్‌ ప్రతినిధులు అడ్డుపడుతున్నారని ట్రంప్‌ మండిపడ్డారు.