ఇకపై వీసా విధాన౦ మరింత కఠినం : ట్రంప్

SMTV Desk 2017-11-02 11:10:21  america terrorist attack, truck incident, donald trump.

న్యూయార్క్, నవంబర్ 02 : నిన్న ట్రక్కుతో దాడి చేసి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే ఇక ఆ ఉగ్రవాది ఉండేది క్యూబాలోని గ్వాంటనామా బే జైలులోనేనని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వాడు సమాజంలో కలిసి తిరగడానికి అర్హుడు కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తమ దేశ వలస విధానం మంచిదని ఇలా ఏ దేశం నుండైనా వచ్చే వారికి అనుమతులు ఇస్తూ పోతుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని హెచ్చరించారు. ఇకపై వీసా విధానాన్ని మరింత కఠినం చేస్తామన్నారు. ప్రతిభ ఆధారంగా వచ్చే వలస విధానమే తన అభిమతమని, అదే దేశాభివృద్దికి దోహదం చేస్తుందన్నారు. అమెరికాను సురక్షితంగా చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.