జగన్ ఛాంబర్ లో నీరుకి కారణం చంద్రబాబు?

SMTV Desk 2017-06-07 15:27:27  YSRCP, AP Assembly,Jagan chamber,Chandrababu

అమరావతి, జూన్ 7 : జగన్ ఛాంబర్ లో వర్షపు నీరు రావడానికి సీఎం కారణమని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ భవనాన్ని నూజివీడులో కాకుండా, అమరావతిలో నిర్మించారని ఇక్కడ భవనాన్ని నిర్మించకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ ప్రభుత్వం వినకుండా తమ సొంత నిర్ణయాలను తీసుకుందని తెలిపారు. ఛాంబర్ లో వర్షపు నీటి గురించి తెలుసుకోవడానికి వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడంతో, వారిని అసెంబ్లీ అధికారులు అనుమతించలేదు. అందులకు వీరంతా కలిసి శాసనసభ ద్వారం ముందు బైటాయించారు. మీడియాను శాసనసభలోకి ప్రవేశింపజేస్తే ప్రభుత్వం చులకన అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే లోపలికి అనుమతించట్లేదని వైకాపా నేతలు విమర్శించారు. దీనికి నిరసనగా తాము కూడా శాసన సభలో అడుగుపెట్టబోమని తెలిపారు.