క్షిపణులను తరలిస్తున్న కిమ్ జాంగ్..

SMTV Desk 2017-10-14 15:27:14  North Korean, President Kim Jong, The missiles are moving

వాషింగ్టన్, అక్టోబర్ 14 : అమెరికాపై దాడికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆ దేశ రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపానికి క్షిపణులను తరలిస్తున్నట్లు అమెరికా శాటిలైట్లు తీసిన చిత్రాల్లో స్పష్టమైంది. దీంతో అప్రమత్తమైన అమెరికా అధికారులు వారు తరలిస్తున్నవి వాసాంగ్-14 ఇంటర్‌కంటినెంటల్ మిసైల్సా లేదంటే వాసాంగ్-12 ఇంటర్‌మీడియట్ రేంజ్ మిసైల్సా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. గత కొద్దిరోజులుగా నిశబ్దాన్ని పాటించిన ఉత్తరకొరియా మళ్ళీ తిరిగి హెచ్చరికలను మొదలు పెట్టింది. ఇదిలా ఉండగా అమెరికా ద్వీపం గువామ్‌పై దాడికి సిద్ధమమంటూ ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది.