రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ౦ : ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం

SMTV Desk 2017-10-10 12:52:25  TDP MLC Reddy Subramanyam, East Godavari District, district level seminar was conducted for farmers.

తూర్పుగోదావరి, అక్టోబర్ 10 : తూర్పుగోదావరి జిల్లాలోని రుణమాఫీకి సంబంధించి జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ముమ్మడివరం నియోజకవర్గానికి చెందిన.. పోలవరం మండలం, మురాముళ్ళు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద మూడవ విడతగా జిల్లాలోని 2,50,570 మంది రైతులకు 175.93 కోట్ల రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. "రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ౦. ఇందులో భాగంగానే దేశ చరిత్రలో 24 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో మన జిల్లాలో 9 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, అమలాపురం పార్లమెంటు సభ్యులు రవీంద్రబాబు, శాసన మండలి సభ్యులు చిక్కాల రామ చంద్రరావు, నామన రాంబాబు, వరుపుల రాజా లతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.