లాహోర్, అక్టోబర్ 9 : పంజాబ్ ప్రావిన్స్ లో రంగస్థల నటి షమీమ్‌ను కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా నాకు, నా సోదరికి బెదిరింపు కాల్స్ వస్తున్న క్రమంలో.. నేటి ఉదయం తన సోదరిని ఎవరో కాల్చి చంపారంటూ ఆమె సోదరుడు సయఫ్ ఉర్ రెహ్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమే మరణం వెనుక ఆమె మాజీ భర్త హస్తం ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.