ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వీరభద్ర..

SMTV Desk 2017-10-08 14:55:45  YCP MLC Kolagatla Virabhadraswami, Resignation.

విజయనగరం, అక్టోబర్ 8 : వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి.. విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. తన స్థానంలో మరొకరిని నియమించాలంటూ పార్టీ అధిష్టాన్ని కోరుతూ.. ఒక లేఖ రాశారు. ఆ లేఖలో " నేను విజయనగరం వైసీపీ శాసనసభ నియోజకవర్గ సమన్వయ కర్తగా నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకున్న వ్యక్తిగత కారణాలే ఇందుకు కారణం" అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.