టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ..

SMTV Desk 2017-10-08 14:03:05   AP Chief Minister, Chandrababu Naidu, TDP leaders meeting.

హైదరాబాద్, అక్టోబర్ 8 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పలువురు నేతలతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటూ నేతలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం త్వరలోనే ఆయన తెలంగాణలో పర్యటి౦చనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని మోత్కుపల్లి లాంటి సీనియర్ నేతలు అన్నారు. ఒకవేళ పొత్తు విషయమై ఆలోచిస్తే బీజేపీ, టీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీలతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు నేతలతో సమావేశమై మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఎల్ రమణ, ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.