విద్యుత్ వాహనాలు వచ్చేస్తున్నాయి

SMTV Desk 2017-06-06 19:02:37  eletric car, polution less car, kwalcom , hallo technology

న్యూఢిల్లీ, జూన్ 6 : కాలుష్యం తగ్గించేందుకు విద్యుత్ వాహనాలే శ్రేయస్కారమని ప్రపంచం అంతా విద్యుత్ వాహనాల వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రముఖ దిగ్గజ కంపేనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీలో తమ ప్రగతిని ప్రదర్శిస్తునే ఉన్నాయి. రానున్న ఐదు, పది లేదా 13 సంవత్సరాల్లో భారత్ లో 90 శాతం వాహనాలు విద్యుత్ తోనే నడుస్తాయని ఒక అధ్యాయనం వెల్లడిస్తోంది. కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలతో వచ్చే ఇబ్బందుల మాటేమిటి వందల కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే మార్గమధ్యంలో బ్యాటరీ ఖాళీ అయిపోతే అన్న సందేహాలు తలెత్తవచ్చు.అయితే అటువంటి సమ స్యలేవి తలెత్తవని క్వాల్ కామ్ ప్రకటిస్తోంది. మీరు రోడ్డుపై విద్యుత్ వాహనంతో దూసుకెళుతూ ఉంటే మేము మా టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు అక్కడికక్కడే బ్యాటరీలు ఛార్జ్ చేసేస్తూ ఉంటాం అంటోంది. కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లను వైర్ లేస్ పద్దతిలో ఛార్జ్ చేసుకుంటున్న మాదిరిగా ఛార్జ్ చేయడం ఎలా అన్న విషయాలపై పరిశోధనలు చేస్తోంది. హాలో పేరుతో ఓ వినూత్న టెక్నాలజీని అవిష్కరించింది ఆ కంపెనీ, మన ఇళ్లల్లో వాడే ఇండక్షన్ స్టౌ గురించి మీకు తెలిసే ఉంటుంది. అచ్చం దాని మాదిరిగానే హాలో కూడా అయస్కాంతాలను ఉపయోగించుకుని విద్యుత్తును వైర్ లెస్ పద్దతిలో సరఫరా చేస్తుంది. రోడ్డు వెంబడి ఇండక్షన్ పొయ్యి లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవడం..వీటి ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తును గ్రహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వాహనాల అడుగున చేసుకోవడం ద్వారా హాలో పనిచేస్తుంది. రోడ్డుపై వాహనం వెళుతున్నప్పుడు ఒక్కో పరికరం కొంత చొప్పున విద్యుత్ అందిస్తూంటుందన్నమాట. పార్కింగ్ స్థలాల్లోనూ హాలో పరికరాలు ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేకంగా ప్లగ్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాటరీలను చార్జ్ చేయవచ్చు. ప్రత్యేకమైన ఏర్పాట్ల ద్వారా ఏ కారుకు ఎంత మేరకు విద్యుత్తు అవసరమో గుర్తించి అంతే సరఫరా అయ్యేలా చేయవచ్చని, కారు సైజును బట్టి గంటకు 3.3 కిలో వాట్, లేదా గంటకు 20 కిలో వాట్ విద్యుత్తును సరఫరా అయ్యేలా చేయవచ్చు. వచ్చే ఏడాది నుంచే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకరానున్నట్లు ఆ సంస్థ వివరించింది.