ఏపీ జాతీయ జల రవాణా శంకుస్థాపనకు ఉపరాష్ట్రపతి...

SMTV Desk 2017-10-03 15:06:30  AP National Transmission Corporation, Vice-President Venkiah Naidu, Union Minister Nitin Gadkari, AP CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 03 : ముక్త్యాల-విజయవాడ జాతీయ జల రవాణా మార్గానికి శంకుస్థాపన సంతోషకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా నదులన్నీ ఇంకీ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన అనుసంధానమే పరిష్కార మార్గం అని తెలిపారు. కాగా కృష్ణా-గోదావరి నదుల్ని అనుసంధానం చేసి ఆదర్శంగా నిలిచారని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం చేస్తున్న సాయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు నదుల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు.