ఉత్తర కొరియాపై అమెరికా యుద్ధ విమానాలు ఎగిరిన వేళ

SMTV Desk 2017-09-18 18:23:40  North Korea VS USA, USA, North Korea, North korea president kim, South Korea

అమెరికా, సెప్టెంబర్ 18: గత కొంతకాలంగా ఉత్తరకొరియా వికృత చర్యలు చేపడుతున్న నేపధ్యంలో మొదటిసారిగా అమెరికా కిమ్ ప్రభుత్వానికి తన సత్తా తెలిపింది. వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్-35బి స్టెల్త్ ఫైటర్స్, రెండు బీ-1బీ యుద్ధ విమానాలు కొరియా ద్వీపకల్పంపై చక్కెర్లు కొట్టాయి. దీనిపై దక్షిణ కొరియా రక్షణ శాఖ మాట్లాడుతూ... అమెరికా-దక్షిణ కొరియా కూటమి సైనిక బలగానికి, ఉత్తర కొరియా బలగానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలిపే విధంగా ఈ చర్యను చేపట్టినట్లు వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్-15కే జెట్ ఫైటర్లు కూడా ఈ చర్యలో భాగం పంచుకున్నట్లు సమాచారం. అయితే శత్రు దేశం ఉత్తర కొరియాపై అమెరికా ఇలాంటి బదులువ్వడం ఇదే మెదటిసారి. ఈ నేపధ్యంలో ఇలాంటి సంయుక్త విన్యాసాలు మరిన్ని చేపడతామని దక్షిణ కొరియా హెచ్చరించింది.