సద్దాం హుస్సేన్ చివరి రోజులు...

SMTV Desk 2017-06-05 17:56:36  iraq, saddam hussen, president saddam hussen, amricon prison

న్యూయార్క్, జూన్ 5 : ఇరాక్ అధ్యక్షులు సద్దాం హుస్సేన్ తన చివరి రోజుల్లో ఎంతో సంతోషంగా ఉంటూ, ఆమెరికా సైనికులతో సరదాగా గడిపేవారని వెల్లడైంది. అమెరికా సైనికులతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారికి కథలు చెబుతూ ఎంతో ఆనందంగా ,ఒత్తిడి లేకుండా ఉండే వారని ఓ సైనికుడు వ్రాసిన పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలిసింది. జైల్లో విధులు నిర్వహించే సైనికుల్లో ఒకరైన విల్ బర్డెన్ వర్పర్ తన పుస్తకం ది ప్రిజనర్ ఇన్ హిస్ ప్యాలెస్ సద్దాం హుస్సేన్, దిఅమెరికన్ గార్డ్స్ అండ్ వాట్ హిస్టరీ అన్ సెడ్ లో సద్దాం హుస్సేన్ కు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. ఇరాక్ ను మూడు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన సద్దాం హుస్సేన్ అమెరికా బంధీగా ఉన్న సమయంలో జరిగిన పలు విషయాలను ఆ పుస్తకంలో వివరించాడు. సద్దాం హుస్సేన్ కు పాటలంటే ఇష్టమని, అమెరికా సింగర్ మేరీ జే బ్లిజ్ పాటలను వింటూ మఫిన్స్ ( గుండ్రటి కేకులా ఉండే పదార్ధం ) తింటూ సంతోషంగా గడిపే వాడని పేర్కొన్నారు. ఆహారం విష యంలో సద్దాం హుస్సేన్ చాలా జాగ్రత్తలు తీసుకునే వారని, బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఆమ్లెట్, మఫిన్స్, తాజా పండ్లు తినేవాడని, ఒకవేళ అమ్లెట్ సరిగా లేక పోతే తిరస్కరించేవాడని ఆ పుస్తకంలో వివరించారు. సద్దాంహుస్సేన్ ను 2006 లో ఉరితీసిన విషయం తెలిసిందే.