బాబు పాలనలో శంకుస్థాపనలే తప్ప, ప్రారంభోత్సవాలు లేవు

SMTV Desk 2017-09-15 19:41:31  Botsa Satyanarayana, AP chief Minister, Capital City

విశాఖ, సెప్టెంబర్ 15: విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వైకాపా నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో శంకుస్థాపనలే తప్ప, ప్రారంభోత్సవాలు జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో గొప్ప రాజధాని నిర్మాణమంటూ కాలం వృధా చేస్తున్నారే తప్ప, అధికారంలోకి వచ్చి 39 నెలలు గడచిన ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మండిపడ్డారు. రాజధాని డిజైన్లకు ఇంజినీర్లను కాదని సినిమా వాళ్లను సంప్రదించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం ఎటు వెళ్తోందని, ఏమిటీ మేధావి తనమని బాబుపై నిప్పులు చెరిగారు. తమకీ రంగంలో ప్రాధాన్యత లేదని సినిమా డైరెక్టర్లు చెబుతుంటే బాబు వాళ్ల సలహాల కోసం వెంపర్లాడడంలో ఉద్దేశ్యమేంటని ప్రశ్నించారు.