ఆ వీడియో విషయంలో క్షమాపణలు చెప్పిన వైట్ హౌస్ అధికారి!

SMTV Desk 2017-09-11 19:08:22  Irma Hurricane Storm, Photos, videos, White House Social Media Chief Dane Scavino, Apologies

వాషింగ్టన్, సెప్టెంబర్ 11 : గత కొన్ని రోజులుగా అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‘ఇర్మా’ హరికేన్ తుఫాను కారణంగా లక్షలాది ప్రజలు వెలుగు లేని చీకట్లో మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇర్మా’ బీభత్సం సృష్టించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వైట్ హౌస్ సోషల్ మీడియా చీఫ్ డ్యాన్ స్కావినో పోస్ట్ చేశారు. ఇందులో, మియామీ అంతర్జాతీయ విమానాశ్రయం తడిసి ముద్దయిన వీడియో ఒకటి ఉంది. అయితే, ఆ వీడియో తమ ఎయిర్ పోర్ట్ కు సంబంధించింది కాదంటూ సంబంధిత అధికారులు చెప్పడంతో, ఈ విషయాన్ని తెలుసుకున్న డ్యాన్ స్కావినో స్పందించి, వెంటనే ఆ వీడియోను తొలగించిన ఆయన, పొరపాటున పోస్ట్ చేశానంటూ ఎయిర్ పోర్ట్ అధికారులకు క్షమాపణలు తెలిపారు.