ప్రారంభించని కంపెనీలకు నోటీసులు పంపిస్తాం: విశాఖ పర్యటనలో మంత్రి లోకేష్

SMTV Desk 2017-09-10 16:09:55  AP IT Minister, Nara Lokesh, International Innovation Fair-2017, IT Hub, IT Companies Vizag

విశాఖ, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ పర్యాటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరని కొనియాడారు. నేడు విశాఖలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్-2017 ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, తనను ఈ ఫెయిర్ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. రుషికొండ ఐటీ హిల్‌లో భూములు కేటాయించినా ఇంతవరకు ప్రారంభించని కంపెనీలకు నోటీసులు పంపిస్తామని, మరో 3 నెలల్లోగా పూర్తి చేయకపోతే భూములను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. సాంకేతికత మారు పేరులా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 80శాతం మంది ప్రజల అండ తెదేపాకే ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.