6నెలల్లో కనకదుర్గ ప్లై ఓవర్ పూర్తి చేస్తాం: కలెక్టర్

SMTV Desk 2017-09-10 15:14:01  Vijayawada, AP Chief Minister, Krishna District Collector, Traffic Vijayawada

విజయవాడ, సెప్టెంబర్ 10: నేడు విజయవాడ కనకదుర్గ ప్లై ఓవర్ బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కలెక్టర్ లక్ష్మీ కాంతం నిర్మిత ప్రాంతానికి విచ్చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం నుండి ఈ నెల 20వ తేదీ వరకు కనకదుర్గా ఫ్లై ఓవర్‌ మార్గాన్ని మూసివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బ్రిడ్జి పనుల్లో వేగం పుంజుకుంది. అయితే ఫ్లై ఓవర్‌ పనులను వేగవంతం చేయాలంటూ ముఖ్యమంత్రి నుండి ఉత్తర్వులు అందిన నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఫ్లై ఓవర్‌ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఫ్లై ఓవర్‌ను 6 నెలల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు.