అవి అన్నీ పుకార్లు... కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి: టి.సుబ్బరామిరెడ్డి

SMTV Desk 2017-09-09 15:35:18  T.Subbarami Reddy, TSR, Congress party, YSRCP, Vizag Railway Zone, Senior Actress Jamuna

విశాఖ, సెప్టెంబర్ 9: రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన నేడు వైజాగ్‌లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన కన్న తల్లిలాంటిదని ఎట్టి పరిస్థితులలో పార్టీ వీడనని ఆయన ప్రకటించారు. వైసీపీలోకి వెళ్తున్నానని వస్తున్న వార్తలన్నీ పూకార్లని ఆయన కొట్టిపారేశారు. తాను పార్టీ మారితే ప్రజలు ఒప్పుకోరని, రాబోయే ఎన్నికల్లో తన పోటీ అనుమానమని ఆయన తెలిపారు. విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు ఆయన తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. కాగా, 17వ తేదీన తన పుట్టినరోజు నేపధ్యంలో సీనియర్ నటి జమునకు సన్మానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.