అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు.. వైస్ జగన్

SMTV Desk 2017-09-01 15:50:42  YS jagan, CBI court, High court, CBI inquiry on jagan

హైదరాబాద్, సెప్టెంబర్ 1: వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నేడు ఆయన విచారణ నిమిత్తం హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కాగా, విచారణ అనంతరం కేసును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసు విచారణకు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటీవల జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా, పిటిషన్ కొట్టివేసింది. అంతేకాకుండా సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరుకావల్సిందేనని తేల్చి చెప్పింది.