డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫై దాడి

SMTV Desk 2019-12-02 15:45:01  

హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ట్రాఫిక్ ని అరికట్టాలంటే దానికి సరిగ్గా విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఈ రాష్ట్రానికి చాల అవసరం. అయితే ఒక ద్విచక్ర వాహనదారుడు నాంపల్లి సిగ్నల్ వద్ద వున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫై మాటలతో దూషించడమే కాకుండా, శారీరక దాడికి పాల్పడ్డాడు. హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతుండటంతో ఆ వ్యక్తి ని ఫోటో తీశాడు ట్రాఫిక్ పోలీస్. ఇంకుముంది ఆ యువకుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫై దాడి చేసాడు. మాటలతో ఆగలేదు. పాపం ఆ ట్రాఫిక్ పోలీస్ మాత్రం అతనిని ఏమి చేయలేకపోయాడు. అయితే ఈ విషయం ఫై స్పందిస్తున్న నెటిజన్లు కనీసం సెల్ఫ్ డిఫెన్స్ ని కూడా పోలీసులు నేర్చుకోవడం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే దాడి చేసిన ఆ యువకుడి ఫై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తాగుబోతు అయివుంటాడని అందుకే ఆలా బిహేవ్ చేసాడు అని అంటున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఫై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.