భర్త వేధింపులు..చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని...

SMTV Desk 2019-11-29 16:19:17  

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ లో ఈ ఘోరం జరిగింది. స్వరూప రెసిడెన్సీ లో ఉంటున్న హిరణ్మయి(29), భర్త క్రిష్ణ కిషోర్ వేధింపులు తాళలేక గురువారం మధ్యాహ్నం చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

హిరణ్మయి గచ్చిబౌలి లోని విప్రో కంపెనీ లో పని చేస్తుండగా, ఆమె భర్త కృష్ణ కిషోర్ సైబర్ గేట్ వే లో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో హిరణ్మయి బలవన్మరణానికి పాల్పడింది. తెనాలికి చెందిన హిరణ్మయి కి గుంటూరు కి చెందిన కృష్ణ కిషోర్ తో గత సంవత్సరం వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల బాబు ఉన్నాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.