చెన్నై నుంచి జపాన్‌ కు ఫ్లైట్‌ సర్వీసులు

SMTV Desk 2019-11-20 12:57:56  

చెన్నై నుంచి జపాన్‌ కు డైరెక్ట్‌ ఫ్లైట్ సర్వీస్‌ ప్రారంభం అయింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీల నుంచి నేరుగా ఎయిర్‌ సర్వీసెస్‌ నడుస్తున్నాయి. అయితే తాజాగా చెన్నై ఎయిర్‌ పోర్టు నుంచి టోక్యో నరిత అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసును ప్రారంభించింది ఆల్‌ నిప్పన్‌ ఎయిర్‌ వేస్‌. పారిశ్రామిక, వ్యాపార రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ లో రెండు దేశాల ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించేలా కొత్త విమాన సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించారు సంస్థ ప్రతినిధులు.