బిజినెస్ ముఖ్యంశాలు

SMTV Desk 2019-12-03 12:18:56  

*ఈకమర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆర్ధిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య తీవ్రమా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెటుబడుల నిబంధనలను ఉల్లఘిచాయని వాటిపై కటిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
* టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానుండగా, మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.
*ఈ నెల 5న ప్రకటించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ మరోసారి కీలక రెపో రేటును తగ్గించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. అదే జరిగితే ఇది వరుసగా ఆరో తగ్గింపు అవుతుంది.
*దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీగా ఉన్న మారుతీ సుజుకీ మొత్తం కార్ల అమ్మకాలు నవంబరు నెలలో 1.9 శాతం తగ్గి 1,50,630 యూనిట్లకు చేరుకున్నాయి.
*రామ్కీ ఎల్సామెక్స్ హైదరాబాద్ రింగ్ రోడ్ లిమిటెడ్లో (ఆర్ఈఎల్) 26 శాతం వాటాను రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకుంది..
*ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్కూ ‘ఒత్తిడి’లో ఉన్న ఆస్తుల భయం పట్టుకుంది. కొన్ని రంగాలకు చెందిన కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఎక్కడ మొండి బకాయిలు(ఎన్పీఏ)గా మారతాయోనని భయపడుతోంది.