'చాణక్య' అనే బిరుదు పోయినందుకుసంతోషంగా ఉంది!

SMTV Desk 2019-12-19 13:52:25  

మహారాష్ట్రలో తాము వైఫల్యం చెందలేదని తమకు 105 సీట్లు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఆజ్‌తక్‌ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా..విలేకరి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మా మిత్రపక్షం శివసేన కాంగ్రెస్‌ పార్టీ, ఎన్సీపీలతో పారిపోయిందని అందుకే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ఇక మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభినవ చాణక్య అనే బిరుదు పోయినందుకు బాధపడుతున్నారా అని విలేకరి ప్రశ్నించగా..నిజానికి అలాంటి ఇమేజ్‌ పోవడం మంచి విషయం అని సంతోషంగా ఉందని అమిత్‌ షా తెలిపారు. ఆ రోజు శివసేనతో కలిసి మేము గవర్నర్‌ దగ్గరికి వెళ్లాల్సిన సమయంలో పరిస్థితులు తారుమారయ్యాయి. బిజెపి నుంచే ముఖ్యమంత్రి ఉంటారని..ఎన్నికలకు వెళ్లే ముందే శివసేనకు ఖచ్చితంగా చెప్పాం. అయితే ప్రధాని నరేంద్ర మోడి చరిష్మా కారణంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత శివసేన మాట మార్చింది. ఈ పరిణామాలు నన్ను విసిగించలేదు. కానీ మంచి గుణపాఠం నేర్పాయి అని తెలిపారు.