బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి.

SMTV Desk 2019-11-20 12:57:22  

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్న ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధర 328 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39 వేల 28 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర 748 రూపాయలు పెరిగి 45 వేల 873 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు రూపాయి బలహీనంగా ఉండడమే బంగారం, వెండి ధరలకు కారణమంటున్నారు విశ్లేషకులు.