అది టిడిపి దుర్మార్గ కోరిక....

SMTV Desk 2019-11-09 17:09:36  

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబు పై విమర్శలు చేసారు."సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టిడిపి దుర్మార్గ కోరిక." అని అన్నారు.


"పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు." అంటూ విజయసాయి రెడ్డి ఆరోపించారు