సైన్యానికి భయపడి 81 ఏళ్ల బామ్మను పెళ్ళిచేసుకున్న 24 ఏళ్ల యువకుడు

SMTV Desk 2019-10-02 15:25:37  

81 ఏళ్ల బామ్మ, 24 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. రెండేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న వీరి వార్తా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇయ్యాలో రేపో బకెట్ ను తన్నే వయసులో ఆమెను పెళ్లి చేసుకోవడం వెనుక గల కారణం తెలిసి అంతా షాకవుతున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ కొండ్రాట్యుక్ అనే 24 ఏళ్ల యువకుడు 2017లో 81 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్ల నుంచి ఆమెతోనే సంసారం చేస్తున్నాడు. సైన్యంలో చేరాల్సి వస్తుందనే కారణంతోనే అలెగ్జాండర్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఉక్రేయిన్‌లో 18 నుంచి 26 ఏళ్ల వయస్సు గల పెళ్లికాని యువకులు తప్పకుండా ఏడాదిపాటు సైన్యంలో పనిచేయాలనే నిబంధన ఉంది. దీంతో అలెగ్జాండర్ వృద్ధురాలిని పెళ్లి చేసుకున్నాడు.ఆర్మీలో చేరాలనే నోటీసులకు అలెగ్జాండర్ బదులిస్తూ.. తాను పెళ్లి చేసుకోవడం వల్లే సైన్యంలోకి రాలేకపోతున్నానని, ఆమె వృద్ధురాలు కావడం వల్ల ఆమె బాగోగులు తానే చూసుకోవాలని తెలిపాడు. దీంతో ఆర్మీ అతడిపై కోర్టులో ఫిర్యాదు చేసింది. అతడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సైన్యాన్ని మోసం చేస్తున్నాడని పేర్కొంది. అలెగ్జాండర్ ఇంటికి విచారణకు వెళ్లిన అధికారులు.. అతడు వృద్ధురాలిని అధికారికంగా పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు.సైన్యంలో చేరాల్సి వస్తుందనే కారణంతోనే ఆమెను పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలను అలెగ్జాండర్ ఖండించాడు. ఆమెను చూడగానే ఇష్టం కలిగిందని, పెళ్లి చేసుకోవాలని అనిపించిందని చెప్పాడు. అయితే, అతడు చెప్పింది నమ్మశక్యంగా లేకపోయినా.. న్యాయం అతడి వైపే ఉండటంతో అధికారులు కేసు కొట్టేశారు. చట్టంలోని లొసుగులను అతడు తెలివిగా వాడుకున్నాడని భావించారు. ఇంకో రెండేళ్లు గడిస్తే సైన్యంలోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఆమెకు విడాకులిచ్చి వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చు.అలెగ్జాండర్ సైన్యంలో చేరకుండా తప్పించుకొనే ప్రయత్నం నెటిజనులకు నచ్చలేదు. దేశం కోసం పనిచేయడానికి వెనుకడుగు వేసే వ్యక్తి ఆ దేశంలోనే ఉండకూడదని ట్రోల్ చేస్తున్నారు.