ట్విట్టర్ అప్డేట్ : రెప్లైలను దాచేయొచ్చు

SMTV Desk 2019-09-23 11:11:44  

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల్లో మీ పోస్టుల కింద వచ్చిన కామెంట్స్ మీకు నచ్చకపోతే వాటిని డిలీట్ చేసే ఆప్షన్ మీకు ఉంటుంది. కానీ ట్వీటర్ లో ఆ ఆప్షన్ ఉండదు. ఆ రిప్లై మనకు నచ్చినా, నచ్చకపోయినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ట్వీటర్ లో మీరు పెట్టిన పోస్టుకి వచ్చిన రిప్లైలను కనిపించకుండా హైడ్ చేసే ఫీచర్ ను ట్వీటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతానికి ఆ ఫీచర్ అమెరికా, జపాన్ దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే...

1. ట్వీటర్ ను ఓపెన్ చేసి మీరు చేసిన ట్వీట్ కింద ఏ రిప్లైని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి.
2. ఆ ట్వీట్ పక్కనే ఉండే డౌన్ యారో మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ సాధారణంగా కనిపించే ఆప్షన్లతో పాటు హైడ్ రిప్లై అనే కొత్త ఆప్షన్ కూడా కనిపిస్తుంది.
3. దాని మీద క్లిక్ చేస్తే ఆ రిప్లై మీ ట్వీట్ కింద కనిపించదు