జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీబన్ వరకు మెట్రో సేవలు

SMTV Desk 2019-08-23 10:50:40  

హైదరాబాద్‌ మెట్రో రైల్ సేవలకు నానాటికీ ప్రజాధారణ పెరుగుతుండటంతో మెట్రో సేవలు నగరం నాలుగువైపులకు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీబన్ వరకు మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. కారిడార్‌ 2లో భాగంగా నిర్మించబడిన జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీబన్ మెట్రో లైన్ పొడవు 15 కిమీ కాగా దానిలో 9.6 కిమీ మార్గానికి అనుమతులు లభించాయి. మిగిలిన 5.4 కిమీ మార్గంలో ఇంకా కొంత పని మిగిలి ఉంది. అది పూర్తిచేసి ట్రయల్ రన్స్ నిర్వహించిన తరువాత డిసెంబర్‌లో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి.