ముఖ్యమంత్రి జగన్ మళ్లీ జనంలోకి

SMTV Desk 2019-08-21 13:17:01  

ముఖ్యమంత్రి జగన్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారు. తండ్రి బాటలో ప్రభుత్వ పథకాల అమలుతీరుపై రచ్చబండ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. సెప్టెంబర్ రెండో తేదీన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిరోజునే రచ్చబండకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ రచ్చబండ ప్రారంభించాలనుకున్న ప్రాంతం చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచే జగన్ ఆ కార్యక్రమం మొదలుపెట్టనున్నారు.