రుణమాఫీకి రూ.7 వేల కోట్ల కేటాయింపులతో అంచనాలు

SMTV Desk 2019-08-20 11:30:52  

వచ్చే నెలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2019-20ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.7 వేల కోట్ల కేటాయింపులతో అంచనాలు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. ఇప్పటికే విడతల వారీగా రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ ప్రభు త్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్థిక సంవత్సరం లో తొలి విడత కింద రూ.7 వేల కోట్లు మాఫీ చేయనున్నారు. ఈ లెక్కన మొ త్తం మాఫీ చేయాల్సిన పంట రుణాలు రూ.28 వేల కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. గత రుణమాఫీలో భాగంగా రీషెడ్యూల్ చేసి న వాటికి కూడా మాఫీ చేయనున్నారు.

అలాగే రైతుబంధుకు నిధుల కేటాయిం పు పెరగనుంది. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ పద్దులపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. రా ష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ, సహకార శాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ తదితర శాఖలవారీగా సమీక్ష నిర్వహించా రు. రాబోయే ఏడాదికి అవసరమైన పూ ర్తిస్థాయి ప్రణాళికా సిద్దం చేయాలని, సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకుందామని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్ధసారధి, కమిషనర్ రాహుల్ బొజ్జా, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఉద్యానశాఖ కమీషనర్ వెంకట్రామ్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్, విత్తన డైరెక్టర్, సహకార శాఖ, వేర్ హౌసింగ్, ఉద్యానశాఖ రిజిస్ట్రార్ తదితరులు హాజరయ్యారు.