ఉప్పు ఎక్కువగా తింటున్నారా...జాగ్రత్త పోతారు!

SMTV Desk 2019-08-14 18:07:21  

ఉప్పు ఎంత ఎక్కువున్నా సరిపోలేదు సరిపోలేదు అంటూ తెగ తినేస్తుంటారు చాలా మంది. అయితే అలా తింటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంట. బ్రిగ్‌హమ్ అండ్ విమెన్స్ హాస్పిటల్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సోడియంను మోతాదుకి మించి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతున్నట్లు వారు గుర్తించారు. సోడియం తీసుకునే మోతాదు పెరిగే కొద్దీ మరణించే ముప్పు కూడా పెరుగుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. కాగా భారతీయులు రోజూ దాదాపు 11 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు వాడకం ఎక్కువ. ఉప్పు ద్వారా ఒంట్లో సోడియం స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఉప్పు మోతాదు తగ్గించుకోవడం మంచిది. మూత్రం ద్వారా యూరిన్ ఏ స్థాయిలో బయటకు వెళ్తుందనే దాన్ని బట్టి సోడియం ఎంత తీసుకుంటున్నామో తెలుసుకోవచ్చు. కానీ యూరిన్‌లోని సోడియం స్థాయిలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఇవి మారుతుంటాయి. కాబట్టి ఒక వ్యక్తి రోజులో ఎంత సోడియం తీసుకున్నాడో తెలుసుకోవడానికి 24 గంటల పూర్తి శాంపిల్ అవసరం. అదీగాక రోజూ ఒకే స్థాయిలో సోడియం తీసుకోం. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ రోజుల్లో సోడియం శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది. కవాసకీ ఫార్ములా, ఇతర పద్ధతుల ద్వారా సోడియం స్థాయిలను తెలుసుకోవచ్చు.