కుప్పకూలిన మార్కెట్లు...!

SMTV Desk 2019-08-13 17:09:05  

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(ఆగస్ట్13)న కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 624 పాయింట్ల నష్టంతో 36,958 పాయింట్లకు కుప్పకూలింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,926 పాయింట్లకు క్షీణించింది. ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, ఐటీ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ర్యాలీ చేయడంతో నష్టాలు కొంత పరిమితమయ్యాయి. వాహన అమ్మకాలు పడిపోవడంతో ఆర్థిక మందగమన ఆందోళనలు పెరగడం, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులు (అర్జెంటీనా సంక్షోభం, చైనా-అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు), సంపన్నులపై పన్ను అంశం గురించి ఆర్థిక శాఖ సైలెంట్‌గా ఉండటం వంటి అంశాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మార్కెట్ హైలైట్స్.. నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్, సన్ ఫార్మా, గెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 10 శాతం పరుగులు పెట్టింది. అదేసమయంలో యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 11 శాతం కుప్పకూలింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా పతనమైంది. నిఫ్టీ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైడా పడిపోయాయి.