హోండాకు రీకాల్‌ బెడద

SMTV Desk 2019-07-31 14:15:00  

కార్ల తయారీ దిగ్గజం హోండాకు రీకాల్ సమస్య వేధిస్తోంది. జపాన్‌కు హోండా భారత్‌లో 5,088 కార్లను రీకాల్‌ చేసింది. పాత తరానికి చెందిన జాజ్‌, సిటీ, సీఆర్‌-వీ, సివిక్‌, అకార్డ్‌ మోడళ్ల వాహనాలు ఉన్నాయి. గతంలో వీటికి అమర్చిన టకాట ఎయిర్‌బ్యాగ్‌లను మార్చడం కోసం వీటిని రీకాల్‌ చేశారు. ప్రస్తుతం రీకాల్‌ చేసిన వాహనాల్లో 2007-13 కు చెందిన 2 వేల 99 సిటీ సెడాన్‌ మోడల్‌ , 2003-08 మధ్య, 2011లో తయారు చేసిన సీఆర్‌-వీ మోడల్‌, 2003లో తయారు చేసిన 350 అకార్డ్‌ కార్లు ఉన్నాయి. వీటితోపాటు 2006-08, 2010లో తయారు చేసిన 52 సివిక్‌ కార్లు ఉన్నాయి. 2009-12 మధ్య తయారు చేసిన 10 జాజ్‌ కార్లు ఉన్నాయి. ఇదే ఏడాది ఏప్రిల్‌లో హోండా 3,669 అకార్డ్‌ కార్లను రీకాల్‌ చేసింది. టకాట ఎయిర్‌ బ్యాగ్స్‌లో సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కార్లను రీకాల్‌ చేసింది హోండా కంపెనీ.