ఇంధన ధరలు...వరుసగా మూడోరోజు స్థిరంగా కొనసాగింపు

SMTV Desk 2019-07-05 11:47:49  Petrol, Deseal, Price, New delhi

దేశీయ ఇంధన ధరలు నేడు (జూలై 5) కూడా నిలకడగా కొనసాగాయి. ఈ విధంగా స్థిరంగా ఉండడం నేటికి మూడో రోజు. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.74.88 వద్ద, డీజిల్ ధర రూ.70.06 వద్ద నిలకడగానే కొనసాగింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితే ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.74.66 వద్ద, డీజిల్‌ ధర రూ.69.50 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.74.31 వద్ద, డీజిల్ ధర రూ.69.17 వద్ద నిలకడగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.70.51 వద్ద, డీజిల్ ధర రూ.64.33 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.76.15 వద్దే ఉంది. డీజిల్ ధర రూ.67.40 వద్ద నిలకడగా కొనసాగుతోంది.