ఎన్‌పీఎస్ స్కీమ్‌తో నెలకు రూ.5 వేలు పెన్షన్!

SMTV Desk 2019-06-13 16:06:55  national pension scheme

పదవి విరమణ తరువాత పెన్షన్ అందించే స్కీమ్స్ చాలా ఉంటాయి. అయితే ఇందులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కొంచెం ప్రత్యేకం అని చెప్పవచ్చు. రెండేళ్ల కిందట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్‌డీఏ) వయసు పరిమితిని పెంచింది. దీంతో 18 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 60 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరిన వారు 70 ఏళ్ల వరకు ఇందులో కొనసాగవచ్చు. ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్ ఎన్‌పీఎస్ క్యాలిక్యులేటర్ ప్రకారం.. 65 ఏళ్లలో స్కీమ్‌లో చేరిన వారు కూడా నెలకు రూ.4,924 పెన్షన్ పొందొచ్చు. 70 ఏళ్ల వరకు స్కీమ్ కొనసాగించాలి. నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేయాలి. 70 ఏళ్ల తర్వాత నెలకు రూ.4,924 పెన్షన్ వస్తుంది. ఇక్కడ రాబడిని 8 శాతంగా అంచనా వేశాం. నిజ రాబడి దీని కన్నా ఎక్కువగానే ఉండొచ్చు. అదేవిధంగా నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.3,939 పెన్షన్ పొందొచ్చు. అదే నెలకు రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.1,969 నెలవారీ పెన్షన్ పొందొచ్చు.