రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ

SMTV Desk 2019-06-06 15:33:50  rbi, repo rate

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పలు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. పరపతి విధానం ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. పావు శాతం వడ్డీ రేట్లను తగ్గించినట్టు వెల్లడించారు. అయితే మార్కెట్‌ కనీసం అరశాతం తగ్గిస్తుందన్న అంచనాలు ఉండగా...ఊహించని విధంగా ఆర్బీఐ 0.25 శాతం తగ్గించింది. కాగా రెపో రేటు 5.75 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 5.5 శాతానికి తగ్గింది. 2010 తరవాత రెపో రేటును ఆరు శాతం దిగువకు రావడం ఇదే తొలిసారి. అటు.. గృహ, వాహణ రుణాలపై వడ్డీ రేటును తగ్గించిన ఆర్బీఐ…ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఆన్ లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసింది. కాగా 2019-20 తొలి ప్రథమార్థంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం వరకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. అలాగే ద్వితీయార్థంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 7.5 శాతం ఉండొచ్చని పేర్కొంది.