బహ్రయిన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

SMTV Desk 2019-06-06 14:26:52  telangana state formation day celebrations in bahrain

బహ్రయిన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బహ్రయిన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్ బొలిశెట్టి హాజరయ్యారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ చిత్ర పటానికి పూష్పంజలి సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు తమ వంతు కృషిచేస్తామన్నారు. ఈ వేడుకల్లో టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, గుమ్మల గంగాధర్, సెక్రటరీలు సంగేపు దేవన్న, జాయింట్ సెక్రటరీలు నేరెళ్లరాజు, ప్రమోద్ బొలిశెట్టి, సాయన్న కొత్తూరు, బాజన్న, నడిపి సాయన్న, నరేష్ ఎల్లుల, రాంబాబు, జాగృతి అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.