నిలకడగా ఉన్న ఇంధన ధరలు

SMTV Desk 2019-06-05 16:05:53  Petrol, Deseal, Price, New delhi

బుధవారం దేశీయ ఇంధన ధరలు నిలకడగా ఉంది మంగళవారం నాటి ధరలే కొనసాగాయి. వరుసగా గత ఆరు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం పెట్రోల్ ధర 8 పైసలు, డీజిల్ ధర 22 పైసలు క్షీణించిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.75.70కు, డీజిల్ ధర రూ.71.45 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.75.45 వద్ద, డీజిల్‌ ధర రూ.70.83 వద్దే కొనసాగుతున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.75.10కు, డీజిల్ ధర రూ.70.51కు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 7 పైసలు క్షీణతతో రూ.71.23కు, డీజిల్ ధర 20 పైసలు క్షీణతతో రూ.65.56కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 21 పైసలు దిగొచ్చింది. దీంతో పెట్రోల్ రూ.76.91 వద్ద, డీజిల్ ధర రూ.68.76 వద్ద కొనసాగుతోంది.