అమెరికాకు వెళ్ళే వారు జాగ్రత్త...చైనీయులకు హెచ్చరికలు!

SMTV Desk 2019-06-05 15:26:28  chinese tourists in america, china warns to citizens who going to america

బీజింగ్‌: అమెరికాకు వెళ్ళే చైనీయులకు ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుతున్న వాణిజ్య యుద్ధం రోజురోజుకి పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్ళే వారు అక్కడ వేధింపులు, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని , అక్కడకు వెళ్లాలనుకునే వారు ముందుగా చట్టాలు, నిబంధనల గురించి తెలుసుకుని వెళ్లాలని సూచించింది. వాణిజ్య యుద్ధం దృష్ట్యా గత 15 ఏళ్లలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లే చైనీయుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటీవల అమెరికా చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.