దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంతో

SMTV Desk 2019-06-05 12:24:37  sensex,

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంతో ఉన్నాయి. నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాకత బుల్ జంప్‌లు చేస్తూ దూసుకెళ్తోంది. ఆర్‌బిఐ సమీక్షలో వడ్డీరేట్లు తగ్గించనుందనే అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి. ఆటోమొబైల్, ఐటి, ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఈ వారాన్ని మార్కెట్లు జోరుగా ప్రారంభించాయి. అటు చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం లాంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపర్చాయి. దీంతో సూచీలు కొత్త శిఖరాలను చేరుకున్నాయి. కీలక 40 వేల మార్క్‌ను సెన్సెక్స్ దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553 పాయింట్లు పెరిగి 40,268 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 12,088 వద్ద ముగిసింది.

ప్రధానంగా బజాజ్ ఆటో, ఏసియన్ పెయింట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టీసీఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. గెయిల్, టెక్ మహింద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి షేర్లు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1-0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,193 లాభపడగా, 1415 నష్టాలతో ముగిశాయి. నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 676 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 394 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.