అమెరికా మాపై దాడికి దిగితే... సముద్రంలో కలిపేస్తాం: ఉత్తరకొరియా అధ్యక్షుడు

SMTV Desk 2017-08-29 12:50:25  USA, North Korea, Korea President, South Korea, Kim Jong-un

ఉత్తరకొరియా, ఆగస్ట్ 29: ఏ దేశం ఎన్నిరకాల హెచ్చరికలు జారీ చేసిన ఏమాత్రం వెనుతిరగని ఉత్తర కొరియా అధ్యక్షుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటికప్పుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్ తనదైన రీతిలో సమాధానమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన అధికార పత్రిక రొడాంగ్ సిన్మన్ నావికాదళ 68వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణకొరియా, అమెరికాలకు సూటిగా హెచ్చరికలు చేసింది. “మా దేశంపై దాడికి దిగితే మొత్తం అమెరికాను సముద్రంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విధ్వంసపు కత్తితో పొడవాలని చూస్తున్న దక్షిణ కొరియాను, దాని వెనకున్న అమెరికాను ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యాన్ని సాధించాం. అమెరికా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే ఉత్తర కొరియా నావికాదళం సత్తా చాటుతుంది” అంటూ కిమ్ మండిపడ్డారు.