వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంచలనం నిర్ణయం.. ఆశావర్కర్ల వేతనం రూ.10 వేలకు పెంపు

SMTV Desk 2019-06-04 15:05:40  jagan,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశావర్కర్ల వేతనాన్ని భారీగా పెంచింది. గత ప్రభుత్వంలో రూ.3 వేల ఉన్న వారి వేతనాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదేవిదంగా ఏపీలోని తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ వేతనాలు పెంచుతామంటూ ఆశావర్కర్లకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు వైఎస్ జగన్‌. ఇప్పటి వరకు ఏపీలో ఆశావర్కర్లకు వేతనం నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తుండగా... వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒకేసారి ఏకంగా రూ. 7 వేలు పెంచి.. మొత్తం రూ.10 వేలు చేశారు. కాగా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్.. ఈ సంచలనం నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.